ఆ రీమేక్‌లో బాలయ్యా! | Balakrishna in Telugu Remake of Pink | Sakshi
Sakshi News home page

ఆ రీమేక్‌లో బాలయ్యా!

Jul 7 2019 12:18 PM | Updated on Jul 7 2019 12:18 PM

Balakrishna in Telugu Remake of Pink - Sakshi

‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ల ఎఫెక్ట్ నందమూరి బాలకృష్ణ మీద గట్టిగానే కనిపిస్తుంది. ఎప్పుడూ గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేసే బాలయ్య, ఎన్టీఆర్ బయోపిక్‌ రిలీజ్‌ తరువాత ఆలోచనలో పడ్డాడు. కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా బాలయ్యతో మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

బాలీవుడ్‌లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పింక్‌. ఈ సినిమాను తమిళ్‌లో అజిత్‌, శ్రద్ధా శ్రీనాథ్‌లతో రీమేక్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే సినిమాను తెలుగులో బాలకృష్ణ ప్రధాన పాత్రలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి బాలకృష్ణ, బిగ్‌ బీ నటించిన పాత్రలో సెట్ అవుతాడా..? లేక బాలకృష్ణకు తగ్గట్టుగా కథలో మార్పులు చేస్తారా? అన్న విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement