ప్రతిభకు వేదిక ఇది | Adi Lekka Platinum Disc Function - Manoj Nandam | Sakshi
Sakshi News home page

ప్రతిభకు వేదిక ఇది

May 6 2014 11:04 PM | Updated on Sep 2 2017 7:00 AM

ప్రతిభకు వేదిక ఇది

ప్రతిభకు వేదిక ఇది

‘‘నేను చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. గేయ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాను. సంగీత దర్శకునిగా మాత్రం అనుకున్న స్థానానికి చేరుకోలేకపోయాను.

 ‘‘నేను చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. గేయ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాను. సంగీత దర్శకునిగా మాత్రం అనుకున్న స్థానానికి చేరుకోలేకపోయాను. నాలాగా స్ట్రగుల్ అవుతోన్న ప్రతిభావంతులకు వేదికగా ఈ సినిమా చేశాం’’ అని చిన్ని చరణ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అదీ లెక్క’ ఈ నెల 9న విడుదల కానుంది. మనోజ్ నందం, మహి, కృష్ణుడు, ప్రియాంక, నిక్కి అన్విల్ ముఖ్య తారలుగా మల్లేష్ కొండేటి సమర్పణలో చిన్ని చరణ్, రమ్య ప్రవీణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తన ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సినిమాతో చక్కటి అవకాశం దొరికిందని మనోజ్ నందం చెప్పారు. ఈ వేడుకలో సాయికార్తీక్, మహి, ప్రియాంక, వినాయకరావు, సురేష్ కొండి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement