రాజీ పడాలన్నాడు

Actress Takes Deverakonda's Name in Casting Couch - Sakshi

‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్‌ కౌచ్‌ సంఘటనలను హీరోయిన్లు బయటకు చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్‌ తన చేదు అనుభవాలను పంచుకున్నారు. తమిళంలో ‘వరుత్తపడాద వాలిబర్‌ సంఘం, తిరుట్టుపయలే 2, మిస్టర్‌ లోకల్‌’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు హీరోయిన్‌ షాలు షాము. తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేస్తూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు – ‘‘నేనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. కానీ దాని గురించి కంప్లయింట్‌ చేయదలచుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే మనం ఆరోపించిన వారు తమ తప్పును అంగీకరిస్తారా? చాన్సే లేదు. ‘నాతో కాంప్రమైజ్‌ అయితే నీకు విజయ్‌ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తా’ అని ఓ దర్శకుడు ప్రపోజల్‌ పెట్టాడు’’ అని పేర్కొన్నారు షాలు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? మీ ఊహలకే వదిలేస్తున్నాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top