ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ | actress Rambha filed a petition in family court | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన హీరోయిన్

Oct 25 2016 9:42 PM | Updated on Apr 3 2019 9:14 PM

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన హీరోయిన్ - Sakshi

ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన హీరోయిన్

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి రంభ వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్దంలో పడింది.

చెన్నై: టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి రంభ వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్దంలో పడింది. గత కొన్ని నెలలుగా రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాథన్  నుంచి విడిగా ఉంటోంది. రంభ దంపతులకు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తనకు భర్తతో కలిసి జీవితాన్ని మళ్లీ పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో తాను భర్తతో కలిసి ఉండాలనుకున్నట్లు పేర్కొంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరింది. వచ్చే డిసెంబర్‌ 3న రంభ కేసు విచారణకు రానుంది.

బాలీవుడ్ లో మొదలైన విడాకుల వ్యవహారాలు ఈ మధ్య దక్షిణాది ఇండస్ట్రీలలోనూ కనిపిస్తోంది. ఇటీవల అమలాపాల్, సౌందర్య రజనీకాంత్ తర్వాత ప్రస్తుతం రంభ వైవాహిక జీవితంలో సమస్య మొదలైంది. 2010 ఏప్రిల్‌లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. ఏవో సమస్యలు రావడంతో కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. వివాహానికి ముందు టాలీవుడ్ లో 1990, 2000 దశకంలో అగ్రహీరోలతో నటించి రంభ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మూవీలలోనూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement