breaking news
Indran Padmanathan
-
మూడో బేబీకి తల్లి కాబోతున్నా:రంభ
90స్లో టాప్ హీరోస్ అందరితో యాక్ట్ చేసిన రంభని అంత సులువుగా మరచిపోలేం. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా రంభ మంచి పేరు తెచ్చుకున్నారు. కెనడా బిజినెస్‌మ్యాన్ ఇంద్రన్ పద్మనాథన్‌ని వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నారామె. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు రంభ. ఈ విషయం గురించి రంభ చెబుతూ –‘‘ఈ హ్యాపీ మూమెంట్లో నన్ను అభిమానించే వారందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మూడో బేబీకి తల్లి కాబోతున్నాను. ఈ ఆనందాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియట్లేదు’’ అన్నారు. -
ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన హీరోయిన్
చెన్నై: టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటి రంభ వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్దంలో పడింది. గత కొన్ని నెలలుగా రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాథన్ నుంచి విడిగా ఉంటోంది. రంభ దంపతులకు ఇద్దరు సంతానం అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తనకు భర్తతో కలిసి జీవితాన్ని మళ్లీ పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో తాను భర్తతో కలిసి ఉండాలనుకున్నట్లు పేర్కొంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరింది. వచ్చే డిసెంబర్ 3న రంభ కేసు విచారణకు రానుంది. బాలీవుడ్ లో మొదలైన విడాకుల వ్యవహారాలు ఈ మధ్య దక్షిణాది ఇండస్ట్రీలలోనూ కనిపిస్తోంది. ఇటీవల అమలాపాల్, సౌందర్య రజనీకాంత్ తర్వాత ప్రస్తుతం రంభ వైవాహిక జీవితంలో సమస్య మొదలైంది. 2010 ఏప్రిల్‌లో కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాథన్‌ను వివాహం చేసుకుంది. ఏవో సమస్యలు రావడంతో కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు. వివాహానికి ముందు టాలీవుడ్ లో 1990, 2000 దశకంలో అగ్రహీరోలతో నటించి రంభ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మూవీలలోనూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు.