మూడో బేబీకి తల్లి కాబోతున్నా:రంభ | Rambha pregnant with third child | Sakshi
Sakshi News home page

మూడో బేబీకి తల్లి కాబోతున్నాను

May 24 2018 12:26 AM | Updated on May 24 2018 11:14 AM

Rambha pregnant with third child - Sakshi

రంభ

90స్‌లో టాప్‌ హీరోస్‌ అందరితో యాక్ట్‌ చేసిన రంభని అంత సులువుగా మరచిపోలేం. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో కూడా రంభ మంచి పేరు తెచ్చుకున్నారు. కెనడా బిజినెస్‌మ్యాన్‌ ఇంద్రన్‌ పద్మనాథన్‌ని వివాహం చేసుకున్నాక సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నారామె. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు లాన్య, శాషా ఉన్నారు. మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు రంభ. ఈ విషయం గురించి రంభ చెబుతూ –‘‘ఈ హ్యాపీ మూమెంట్‌లో నన్ను అభిమానించే వారందరితో షేర్‌ చేసుకోవాలనుకుంటున్నాను. మూడో బేబీకి తల్లి కాబోతున్నాను. ఈ ఆనందాన్ని ఎలా ఎక్స్‌ప్రెస్‌ చేయాలో తెలియట్లేదు’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement