లాల్‌ సింగ్‌ టైమ్‌కి రాడా? | Aamir Khan Laal Singh Chaddha Postponed | Sakshi
Sakshi News home page

లాల్‌ సింగ్‌ టైమ్‌కి రాడా?

Apr 21 2020 5:00 AM | Updated on Apr 21 2020 5:00 AM

Aamir Khan Laal Singh Chaddha Postponed - Sakshi

ఆమిర్‌ ఖాన్

ఈ ఏడాది చివర్లో థియేటర్స్‌లోకి రావాలన్నది లాల్‌ సింగ్‌ చద్దా ప్లాన్‌. కానీ ఆ ప్లాన్‌లో మార్పు ఉండబోతోందని బాలీవుడ్‌ టాక్‌. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్‌ కథానాయిక. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను క్రిస్మస్‌ సీజన్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు ఆమిర్‌ ఖాన్‌. అయితే కరోనా వైరస్‌ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్‌ పడటంతో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ను క్రిస్మస్‌ సీజన్‌లో రిలీజ్‌ చేయడం కష్టం అంటున్నారు. మరి లాల్‌ సింగ్‌ అనుకున్న టైమ్‌కి వస్తాడా? రాడా?  చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement