'సారే జహాసే అచ్ఛా' అంటున్న ఆమిర్

'సారే జహాసే అచ్ఛా' అంటున్న ఆమిర్


బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. పీకే సినిమాతో భారతీయ సినీ రికార్డ్లను తిరగరాసిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం దంగల్ సినిమాలో నటిస్తున్నాడు. బయోపిక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిల తండ్రిగా నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోందిదంగల్ సినిమా సెట్స్ మీద ఉండగానే మూడు సినిమాలకు ఓకె చెప్పాడు ఆమిర్. ఇప్పటికే అద్వైత్ చౌహాన్ తెరకెక్కిస్తున్న సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ షూటింగ్ పూర్తి చేశాడు. తొలి సారిగా అమితాబ్తో కలిసి నటిస్తున్న థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాను సెట్స్ మీదకు తీసకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను 2018 దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ రెండు సినిమాల తరువాత మరోసారి బయోపిక్లో నటించేందుకు అంగీకరించాడు ఆమిర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యోమగామి రాకేష్ శర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో ఆమిర్ నటించనున్నాడు. ఈ సినిమా కోసం సెల్యూట్, సారే జహాసే అచ్ఛా అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top