షాకింగ్‌: ఆరు రోజుల చిన్నారిని బ్యాగులో కుక్కి..

Women Caught At Manila Airport For Carry 6 Day Old Baby Inside Hand Luggage  - Sakshi

మనీలా : ప్రయాణం చేసే సమయాల్లో ఎవరైనా బ్యాగుల్లో దుస్తులు, సామాన్లు తీసుకెళ్తారు... లేదంటే తినే వస్తువులు తీసుకెళ్తారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ మహిళ మాత్రం ఆరు రోజుల పాపాయిని బ్యాగులో తీసుకువెళ్లింది. ఈ షాకింగ్‌ ఘటన పిలిఫ్పీన్స్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన మహిళ  దేశాన్ని విడిచి వెళ్లే క్రమంలో మనీలా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు తనిఖీ విభాగం అధికారులు సదరు మహిళ బ్యాగ్‌ను​ తెరిచి చూడగా అందులో చిన్నారి కనిపించింది.

ఈ ఘటన గురించి పిలిఫ్పీన్స్‌ ఇమిగ్రేషన్‌ బ్యూరో ప్రతినిధి మాట్లాడుతూ.. 43 సంవత్సరాల ప్రయాణికురాలి బ్యాగులో ఓ పసిపాపను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌పోర్టులోకి మహిళ ఒంటరిగా ప్రవేశించిందని, తన వ్యక్తిగత పాస్‌పోర్టు అధికారులకు సమర్పించిన అనంతరం తనిఖీలు నిర్వహించే సమయంలో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. కాగా ఆ చిన్నారి మయస్సు కేవలం ఆరు రోజులు మాత్రమే అని, మహిళ వద్ద చిన్నారికి సంబంధించిన ఎలాంటి వివరాలు లేకపోవడంతో  పూర్తి వివరాలు తెలయలేని తెలిపారు. ఈ క్రమంలో అధికారులు మహిళను విచారించగా చిన్నారికి వరుసకు అత్తయ్య అవుతానని  తెలిపింది. అయితే ఈ విషయం పై ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారలు ఆమెను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top