అమెరికా సరస్సులో ఏపీ యువకుడు గల్లంతు..! | Vizag Man Missing In A Lake In America | Sakshi
Sakshi News home page

అమెరికా సరస్సులో ఏపీ యువకుడు గల్లంతు..!

Jun 4 2019 9:33 AM | Updated on Jun 4 2019 10:46 AM

Vizag Man Missing In A Lake In America - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌/విశాఖ : విశాఖ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని ఓ సరస్సులో గల్లంతయ్యాడు. ఉన్నత చదవుల కోసం ఐదేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అవినాష్‌ రెండు రోజుల కిందట స్నేహితులతో కలిసి ఓ సరస్సులో బోటు షికారుకు వెళ్లాడు. సరస్సు లోతుగా ఉండటం, ఊబి కూడా ఉండటంతో ప్రమాదవశాత్తూ అవినాష్‌ గల్లంతయ్యాడని అతని స్నేహితులు వెల్లడించారు. అవినాష్‌ కుంటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. అవినాష్‌ స్టీల్‌ ప్లాంట్‌ టౌన్‌షిప్‌కు చెందిన ఎ.వెంకటరావు కుమారుడని తెలిసింది. ఎంఎస్‌ పూర్తి చేసిన అతను ఇటీవలే ఉద్యోగంలో చేరినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement