ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్! | Video Of Girls getting crore viewers on social media | Sakshi
Sakshi News home page

ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్!

Feb 19 2017 1:19 PM | Updated on Apr 4 2019 3:41 PM

ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్! - Sakshi

ఎలుక కోసం మాస్టర్ ప్లాన్.. వీడియో వైరల్!

ఓ ఎలుక వల్ల కొందరు కాలేజీ యువతులు ఉండే రూమ్ లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఓ ఎలుక వల్ల కొందరు కాలేజీ యువతులు ఉండే రూమ్ లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎలుక వల్ల అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంట్లు డామేజ్ అయ్యేవి. దీంతో బాగా విసిగిపోయిన అమెరికాలోని పెన్సిల్వేనియా నగర యువతులు ఎలుక కోసం ఏకంగా తెలివైన ప్లాన్ వేశారు. సక్సెస్ సాధించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు కోటి మంది వీక్షించారు. దాదాపు లక్షసార్లు ఈ ట్వీట్ రీట్విట్ కావడం గమనార్హం.

వారి ప్లాన్ ఏంటంటే.. ఎలుక ఎక్కువగా తిరిగే రూమ్ తప్ప ఇతర అన్ని రూముల డోర్ మూలల్లో బకెట్, ఇతర వస్తువులను అడ్డుగా పెట్టారు. బాత్రూమ్ నుంచి తొలుత ఓ యువతి ఎలుకను వెల్లగొట్టింది. మరో రూములోకి వెళ్లడానికి యత్నించిన ఎలుకకు బకెట్ అడ్డంకిగా మారింది. సన్నని వరండా కార్నర్లో ఉన్న యువతి ఎలుకను మెట్లపైనుంచి కిందకి తరిమేసింది. చివరి మెట్టు పక్కన ఉన్న మరో యువతి ఎలుకను చీపురుతో బయటకు ఊడ్చేసింది.  ఈ తతంగాన్ని వీడియో తీసి జోడీ మెక్కిన్ అనే యువతి తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కేవలం గంటల వ్యవధిలోనే విపరీతంగా ట్వీట్ కావడం, కొందరు యూట్యూబ్ లోనూ పోస్ట్ చేయడంతో దాదాపు కోటి మంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement