హిందూ కాంగ్రెస్‌ చైర్మన్‌గా శ్రీప్రకాశ్‌

Sriprakash as chairman of the Hindu Congress - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని షికాగోలో సెప్టెంబర్‌ 7 నుంచి మూడ్రోజుల పాటు ప్రపంచ హిందూ కాంగ్రెస్‌(డబ్ల్యూహెచ్‌సీ) సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ప్రఖ్యాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన ప్రొఫెసర్‌ డా.శ్రీప్రకాశ్‌ కొఠారి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు సదస్సు నిర్వాహకులు తెలిపారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ కార్యక్రమంలో టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ సహా 80 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. స్వామి వివేకానంద షికాగోలో 1893, సెప్టెంబర్‌ 11న చారిత్రక ప్రసంగం చేసి 125 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా ఈ సదస్సును అక్కడే నిర్వహించనున్నారు  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top