ఎస్‌–400 కొంటే ఆంక్షలే: అమెరికా

Russia Beefs Up Crimea Defense With Another Battalion of S-400s - Sakshi

వాషింగ్టన్‌: రష్యా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్‌–400ను కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు తప్పవని అమెరికా హెచ్చరించింది. కాస్టా (ఆంక్షల ద్వారా అమెరికా వ్యతిరేక శక్తులను ఎదుర్కొనడం)కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలు, వ్యవస్థలపై ఆంక్షలు అమలు చేసే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌–400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలపై ప్రభావం పడే వీలుంది. ట్రంప్‌ సంతకంచేయగానే ఇటీవలే రష్యా నుంచి సుఖోయ్‌ యుద్ధ విమానాలు, ఎస్‌–400లను కొన్న చైనా సంస్థ, దాని డైరెక్టర్‌ షాంగ్‌ఫూపై అమెరికా ఆంక్షలు విధించింది. రష్యాను లక్ష్యంగా చేసుకునే కాస్టా చట్టాన్ని తెచ్చినట్లు అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top