జింబాబ్వే అధ్యక్షుడిగా మళ్లీ ముగాబే ప్రమాణం | Robert Mugabe sworn in as Zimbabwe president | Sakshi
Sakshi News home page

జింబాబ్వే అధ్యక్షుడిగా మళ్లీ ముగాబే ప్రమాణం

Aug 23 2013 5:14 AM | Updated on Sep 1 2017 10:01 PM

జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే(89) మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1980 నుంచి జింబాబ్వేకు ముగాబేనే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

హరారే: జింబాబ్వే అధ్యక్షుడిగా రాబర్ట్ ముగాబే(89) మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 1980 నుంచి జింబాబ్వేకు ముగాబేనే నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారమిక్కడ ఘనం గా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాది మంది ముగాబే అభిమానులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విపక్ష నేత మోర్గాన్ స్వాన్‌గిరాయ్‌కు చెందిన పార్టీ బహిష్కరించింది.

Advertisement
 
Advertisement
Advertisement