సూసైడ్‌ జాకెట్‌తో పాక్‌ పాప్‌ సింగర్‌ | Pakistan Singer Rabi Pirzada Trolled For Threatening PM Narendra Modi | Sakshi
Sakshi News home page

సూసైడ్‌ జాకెట్‌తో పాక్‌ పాప్‌ సింగర్‌

Oct 24 2019 4:14 AM | Updated on Oct 24 2019 4:14 AM

Pakistan Singer Rabi Pirzada Trolled For Threatening PM Narendra Modi - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన పాప్‌ సింగర్, నటి రబి పిర్జాదా (27) డమ్మీ బాంబులు అమర్చిన  ‘సూసైడ్‌ జాకెట్‌’ తొడుక్కొని ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగింపుకు నిరసనగా ఆమె ఈ చర్యకు పూనుకుంది. మోదీకి హెచ్చరికగా ట్విట్టర్‌లో చేసిన ఈ పోస్టు వైరల్‌ అయింది. దీనిపై కొందరు పాకిస్తాన్‌ పరువు తీస్తున్నావంటూ తిట్టిపోశారు. అనంతరం ఆమె ఆ ఫొటోను తొలగించారు. గతంలో కూడా ఆమె కొండ చిలువలు, మొసళ్ల దగ్గర ఫొటో దిగి వాటిని మోదీపై వదులుతానని వ్యాఖ్యలు చేసింది. అదికాస్తా వైరల్‌ కావడంతో పంజాబ్‌ వణ్యప్రాణి రక్షణ అధికారులు ఆమెకు నోటీసులు పంపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement