ట్రంప్‌ చేష్టలు.. ఘాటుగా స్పందించిన పాక్ | Pakistan Lashes Out At USA over Terror Aide List | Sakshi
Sakshi News home page

Dec 23 2017 8:49 AM | Updated on Apr 4 2019 3:25 PM

Pakistan Lashes Out At USA over Terror Aide List - Sakshi

ఇస్లామాబాద్‌ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాక్‌ పేరును అమెరికా చేర్చిందన్న ప్రకటన  వెలువడి 24 గంటలు గడవక ముందే... పాకిస్థాన్‌ ఘాటుగా స్పందించింది.  మిత్రులతో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

మిత్ర దేశాలు ఒకరి పేరును మరొకరు నోటీసులో ఉంచడం భావ్యం కాదు. అదే సమయంలో శాంతిపై ఇరు దేశాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది అని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య బంధాలను బలహీనం చేస్తాయని, ఆ ప్రభావం అంతర్జాతీయ సమాజంపై పడుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

తమ అధ్యక్షుడు ట్రంప్ పాక్‌ పేరును ఉగ్రవాద దేశాల నోటీసులో ఉంచారంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపకపోతే, పాక్ కు అందిస్తున్న తాయిలాలు కూడా ఆగిపోతాయని ఆయన హెచ్చరించారు. భారత్, ఆఫ్ఘనిస్థాన్ లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలను చేపట్టినా చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తిరిగి స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement