పొట్ట పగిలేలా తిని... | Over 4,000 Visit Karachi Hospitals Due To Overeating On Eid | Sakshi
Sakshi News home page

పొట్ట పగిలేలా తిని...

Sep 15 2016 7:22 PM | Updated on Jul 11 2019 6:18 PM

పొట్ట పగిలేలా తిని... - Sakshi

పొట్ట పగిలేలా తిని...

పండుగ పూట పిండి వంటలు ఎక్కువగా తిని కాస్త భుక్తాయాసం పడటం సహజమే. అతిగా తిని ఏకంగా 4000 మంది ఆస్పత్రులపాలయ్యారు.

కరాచి: పండుగ పూట పిండి వంటలు ఎక్కువగా తిని కాస్త భుక్తాయాసం పడటం సహజమే. కానీ పాకిస్థాన్ లో బక్రీద్ ను పురస్కరించుకొని అతిగా తిని ఒక్క కరాచీ నగరంలోనే  ఏకంగా 4000 మంది ఆస్పత్రులపాలయ్యారు.   ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 4000 మంది ప్రజలు బక్రీద్ రోజున సాంప్రదాయ నాన్ వెజ్ వంటకాలను తిని  డయేరియా, వాంతులు, డీ హైడ్రేషన్, జీర్ణకోశ  సమస్యలతో బాధపడ్డారని కరాచీ వైద్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు.

ఇందులో 2,200 మంది జిన్నా పీజీ మెడికల్ కాంప్లెక్స్, 1,000 మంది కరాచీ సివిల్ హాస్పిటల్, 500 మంది అబ్బాసీ షహీద్ ఆస్పత్రిని సందర్శించారని కరాచీ వైద్యశాఖ అధికారులు  వెల్లడించారు.  ప్రజలు వాతావరణ మార్పుల మూలంగా ఆయిల్ ఫుడ్, జంక్ పుడ్ ను తీసుకోకుండా  శాఖాహారమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మరో 1000 మంది జంతువులను వధిస్తుండగా గాయాలపాలై ఆస్పత్రులను సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement