తిరిగొచ్చిన అమెరికా మహిళా వ్యోమగామి

NASA Astronaut Returns to Earth After longest Mission By Woman - Sakshi

అల్మేటీ (కజకిస్తాన్‌): అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో సుదీర్ఘకాలం గడిపి రికార్డు సృష్టించిన మహిళా వ్యోమగామి క్రిస్టీనో కోచ్‌ ఎట్టకేలకు గురువారం భూమికి తిరిగి వచ్చారు. అమెరికాకు చెందిన ఈ వ్యోమగామి గత ఏడాది మార్చి 14నలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లగా గురువారం ఉదయం (కజకిస్తాన్‌ స్థానిక సమయం) 9.12 గంటల ప్రాంతంలో సోయెజ్‌ క్యాప్సూల్‌ ద్వారా ల్యాండ్‌ అయ్యారు. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన లూకా పర్మిటానో, రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ ష్కోవ్రోట్సవ్‌లుక ఊడా కోచ్‌తోపాటు ఉన్నట్లు రాస్‌కాస్మోస్‌ తెలిపింది.

సోయెజ్‌ క్యాప్సూల్‌ కజక్‌లోని గడ్డిమైదానాల్లో ల్యాండ్‌ అయిన సందర్భంగా తీసిన వీడియోలను రాస్‌కాస్మోస్‌ విడుదల చేసింది. సుమారు 328 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన కోచ్‌.. సోయెజ్‌ క్యాప్సూల్‌లో నవ్వుతూ కనిపించగా.. పర్మిటానో పిడికిలి పైకెత్తి తన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మరోవైపు రష్యన్‌ వ్యోమగామి ఆపిల్‌ పండు తింటూ కనిపించారు. అమెరికాలోని మిషిగన్‌లో జన్మించిన కోచ్‌ గత ఏడాది డిసెంబరు 28న సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన మహిళ వ్యోమగామిగా పెగ్గి విట్సన్‌ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. పెగ్గీ 2016–17లో మొత్తం 289 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top