చివరి వరకు రహస్యం.. | narendra modi's lahore tour | Sakshi
Sakshi News home page

చివరి వరకు రహస్యం..

Dec 25 2015 5:33 PM | Updated on Aug 21 2018 9:39 PM

చివరి వరకు రహస్యం.. - Sakshi

చివరి వరకు రహస్యం..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాహోర్ పర్యటన వివరాలను చివరి వరకు రహస్యంగా ఉంచారు.

లాహోర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాహోర్ పర్యటన వివరాలను చివరి వరకు రహస్యంగా ఉంచారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మోదీ లాహోర్ వస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆప్ఘనిస్తాన్ నుంచి సాయంత్రం 4:45 గంటలకు మోదీ లాహోర్ విమానాశ్రయంలో దిగారు. లాహోర్ విమానాశ్రయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో షరీఫ్ నివాసానికి వెళ్లారు. భద్రత కారణాల రీత్యా మోదీ పర్యటన వివరాలను రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.

మోదీ రాక సందర్భంగా లాహోర్లో అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. మోదీ పాక్లో రెండు గంటల పాటు గడపనున్నారు. మూడు నెలల్లో  మోదీ, షరీఫ్ భేటీకావడమిది మూడోసారి. షరీఫ్తో సమావేశానంతరం మోదీ భారత్కు బయల్దేరుతారు.
 

Advertisement
 
Advertisement
Advertisement