త్రివర్ణ పతాకం ఎగరేసినందుకు పదేళ్ల జైలు | Sakshi
Sakshi News home page

త్రివర్ణ పతాకం ఎగరేసినందుకు పదేళ్ల జైలు

Published Fri, Jan 29 2016 2:19 AM

త్రివర్ణ పతాకం ఎగరేసినందుకు పదేళ్ల జైలు

లాహోర్: పాకిస్తాన్‌లో భారతజాతీయ జెండా ఎగరేసినందుకు ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తికి పాక్‌కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వీరాభిమానైన ఉమర్ జనవరి 26న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ 90 పరుగు లు చేయటంతో భారత జాతీయ పతాకాన్ని ఎగరేశాడు. దీంతో పాక్ పోలీసులు ఉమర్‌పై కేసుపెట్టారు. దీన్ని విచారించిన కోర్టు గురువారం ఉమర్‌కు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టుకు వస్తున్న సందర్భంగా ఉమర్ మాట్లాడుతూ.. తాను విరాట్ కోహ్లీని.. భారత క్రికెట్ జట్టును అభిమానిస్తానని తెలిపాడు.
 
నిరాధార ఆరోపణలొద్దు: పాక్
ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి సంబంధించి తమపై భారత్ నిరాధార ఆరోపణలు చేస్తోం దంటూ పాక్ మండిపడింది. ‘ఉగ్రవాదం ఒక్క భారత్ సమస్యే కాదు. పాక్ కూడా దీని బారిన పడింది. ఉగ్రవాదాన్ని తరిమేసేందు కు చేస్తున్న ప్రయత్నానికి అంతా సహకరించాలి.’ అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కాజీ ఖలీలుల్లా తెలిపారు.
 
ఖరారు కాని చర్చల తేదీలు
న్యూఢిల్లీ: భారత్, పాక్‌ల మధ్య విదేశాంగ కార్యదర్శుల చర్చలకు తేదీలు ఖరారు కాలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం తెలిపారు. ఫిబ్రవరి తొలి వారంలో చర్చలు జరగవచ్చంటూ భారత్‌లో పాక్ హైకమిషనర్ బాసిత్ అన్న నేపథ్యంలో స్వరూప్ ఈ విషయం స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement