
'మిస్టర్ గే వరల్డ్' అయ్యాను!
ఫిలిప్పీన్స్‌కు చెందిన చెందిన జాన్ రస్పాడో 'మిస్టర్ గే 2017' ఈవెంట్లో విజేతగా నిలిచాడు.
ఫిలిప్పీన్స్‌కు చెందిన చెందిన జాన్ రస్పాడో 'మిస్టర్ గే 2017' ఈవెంట్లో విజేతగా నిలిచాడు. స్పెయిన్‌లో నిర్వహించిన మిస్టర్ గే కాంపిటీషన్లో అవార్డు సొంతం చేసుకుని, ఈ టైటిల్ దక్కించుకున్న తొలి ఫిలిప్పీన్స్ వ్యక్తి తానే కావడంపై హర్షం వ్యక్తంచేశాడు. పలు అంశాల్లో తొలి స్థానంలో నిలవడంతో రస్పాడోను టైటిల్ వరించింది. కొన్నేళ్ల కిందట తాను గే అని బహిరంగంగా ప్రకటించాడు. అయితే ఆపై తాను ఏం చేయాలా అని ఆలోచిస్తూ నచ్చిన దిశగా అడుగులు వేయడంతో సత్ఫలితాన్ని పొందినట్లు టైటిల్ నెగ్గిన తర్వాత పేర్కొన్నాడు. అనుకున్న లక్ష్యాన్ని మనసుపెట్టి ప్రయత్నిస్తే విజయం సాధ్యమని అభిప్రాయపడ్డాడు.
మిస్టర్ గే 2017 పోటీలో బగియో సిటీకి చెందిన ఈ ఆరడుగుల హంక్.. బెస్ట్ స్విమ్ వియర్, మిస్టర్ ఆన్‌లైన్ వోట్, మిస్టర్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇన్ ఫార్మల్ వియర్, మిస్టర్ సోషల్ మీడియా విభాగాలలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆన్‌లైన్ మార్కెటింగ్ తనకు గే అని ప్రపంచానికి చెప్పినప్పుడు చాలా భయపడ్డానని మూడేళ్ల కిందట జరిగిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. మిస్టర్ గే టైటిల్ నెగ్గి నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని రస్పాడో తన మనసులో మాట బయటపెట్టాడు. మిస్టర్ గే అవార్డు నిర్వాహకులతో పాటు తనకు ఆన్‌లైన్‌లో ఓటు వేసి విజయానికి కారకులైన అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపాడు.