ఇండోనేసియాలోని పేకన్‌బరు జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు.
జకార్తా: ఇండోనేసియాలోని పేకన్‌బరు జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకుపోయారు. శుక్రవారం ప్రార్థన కోసం జైలు గదుల తలుపులు తెరవగానే ఖైదీలు తోపులాటకు దిగారు.ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టేందుకు యత్నించగా, సాధ్యం కాకపోవడంతో పక్కనున్న ద్వారాన్ని బద్దలుకొట్టి తప్పించుకున్నారు.
విధుల్లో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండటంతో వారిని నియంత్రించడం సాధ్యంకాలేదని జైళ్ల విభాగం డీజీ చెప్పారు. పరారైన వారిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నామన్నారు. ‘జైలు సామర్థ్యం 300 మందికి మాత్రమే. ఇప్పుడు 1,870 మంది వరకూ ఖైదీలున్నారు. వీరందరికీ ఐదుగురు గార్డులే కాపలా కాస్తున్నారు’ అని చెప్పారు.