చిక్కుల్లో నెతన్యాహూ

Israel PM Netanyahu faces corruption charges - Sakshi

ఇజ్రాయెల్‌ ప్రధానిపై అవినీతి ఆరోపణలు

రెండు కేసుల్లో ఆధారాలు.. వైదొలిగేందుకు నెతన్యాహూ నిరాకరణ

జెరూసలేం: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహూ చిక్కుల్లో పడ్డారు. అవినీతి, నమ్మక ద్రోహా నికి సంబంధించి నెతన్యాహూకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. 14 నెలల దర్యాప్తు తర్వాత నెతన్యాహూకు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని, వీటి ఆధారంగా నిందితుల జాబితాలో ఆయన పేరు చేర్చాలని ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన నెతన్యాహూ పదవి నుంచి వైదొలిగేందుకు నిరాకరించారు.

2009 నుంచి నెతన్యాహూ ఇజ్రాయెల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 1996 నుంచి 1999 వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయితే గత పదేళ్లలో బహుమతుల రూపంలో 3 లక్షల అమెరికన్‌ డాలర్లను నెతన్యాహూ పారిశ్రామికవేత్తల నుంచి స్వీకరించినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ పబ్లిషర్‌ ఆర్నన్‌ మోజెస్‌కు లబ్ధి చేకూరేలా కేస్‌ 1000, కేస్‌ 2000కు సంబంధించి ఖరీదైన బహుమతులు అందుకున్నారనే ఆరోపణలపై నెతన్యాహూ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానిని నిందితుడిగా చేర్చాలని సిఫార్సు చేస్తూ పోలీసులు ఆధారాలను అటార్నీ జనరల్‌కు సమర్పిస్తే, ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

జాబితాలో రతన్‌ టాటా!
నెతన్యాహూపై అభియోగాలు మోపాలని ఇజ్రాయెల్‌ పోలీసులు సిఫార్సు చేసిన జాబితాలో పారిశ్రామికవేత్త రతన్‌ టాటా పేరు ఉందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను టాటా కార్యాలయం కొట్టిపారేసింది. ఇజ్రాయెల్‌లో జన్మించిన హాలీవుడ్‌ నిర్మాత మిల్చన్, ఆస్ట్రేలియాకు చెందిన రిసార్ట్‌ యజమాని జేమ్స్‌ ప్యాకర్‌ నుంచి నెతన్యాహూ, ఆయన భార్య సారా భారీగా ముడుపులు పుచ్చుకున్నారంటున్న కేస్‌ 1000లోనే టాటాకూ పాత్ర ఉన్నట్లు ఆరోపణ. మిల్చన్‌కు ప్రయోజనం కలిగేలా నెతన్యాహూ ఫ్రీ ట్రేడ్‌ జోన్‌కు మద్ద తు పలికారని, ఇందులో టాటాకు భాగస్వామ్యం ఉందని పోలీసులు తెలిపారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top