breaking news
israel PM
-
ఇజ్రాయెల్ ప్రధానితో మస్క్: సైబర్‌ట్రక్ రైడ్ వీడియో వైరల్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం తన అమెరికా పర్యటనలో టెస్లా సీఈవో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను కలిశారు. ఈ సందర్భంగా భార్య సారాతో కలిసి నెతన్యాహు నెతన్యాహుని కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీ పర్యటనకు తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మస్క్ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు చెందిన 'సైబర్‌ట్రక్' (ఇంకా లాంచ్ కాలేదు) లో సంచరించారు. ముగ్గురూ ఫ్యాక్టరీ చుట్టూ బ్యాటరీ-ఎలక్ట్రిక్ ఫుల్-సైజ్ పికప్ ట్రక్‌లో ప్రయాణించిన వీడియోను పీఎం ఆఫీసు అధికారిక (ఎక్స్)లో పోస్ట్ చేశారు. Prime Minister Benjamin Netanyahu and his wife Sara toured the @Tesla Motors plant in Fremont, California, together with Tesla CEO, entrepreneur @ElonMusk. pic.twitter.com/GPCx5tBSUm — Prime Minister of Israel (@IsraeliPM) September 18, 2023 ప్రధానమంత్రి, ఆయన భార్యకు టెస్లా అభివృద్ది చేస్తున్న వివిధ మోడళ్లపై ఎలోన్ మస్క్ వివరించారు.అలాగే అధునాతనఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అసెంబ్లింగ్ లైన్‌ను పరిశీలించారని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.అంతేకాదు ఏఐ వినియోగం, దాని మంచిచెడులను, ఏఐ నష్టాలను ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించిచర్చించామంటూ నెతన్యాహూ ట్వీట్ చేశారు. -
చిక్కుల్లో నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ చిక్కుల్లో పడ్డారు. అవినీతి, నమ్మక ద్రోహా నికి సంబంధించి నెతన్యాహూకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. 14 నెలల దర్యాప్తు తర్వాత నెతన్యాహూకు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని, వీటి ఆధారంగా నిందితుల జాబితాలో ఆయన పేరు చేర్చాలని ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన నెతన్యాహూ పదవి నుంచి వైదొలిగేందుకు నిరాకరించారు. 2009 నుంచి నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 1996 నుంచి 1999 వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయితే గత పదేళ్లలో బహుమతుల రూపంలో 3 లక్షల అమెరికన్ డాలర్లను నెతన్యాహూ పారిశ్రామికవేత్తల నుంచి స్వీకరించినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ పబ్లిషర్ ఆర్నన్ మోజెస్‌కు లబ్ధి చేకూరేలా కేస్ 1000, కేస్ 2000కు సంబంధించి ఖరీదైన బహుమతులు అందుకున్నారనే ఆరోపణలపై నెతన్యాహూ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానిని నిందితుడిగా చేర్చాలని సిఫార్సు చేస్తూ పోలీసులు ఆధారాలను అటార్నీ జనరల్‌కు సమర్పిస్తే, ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. జాబితాలో రతన్ టాటా! నెతన్యాహూపై అభియోగాలు మోపాలని ఇజ్రాయెల్ పోలీసులు సిఫార్సు చేసిన జాబితాలో పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు ఉందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను టాటా కార్యాలయం కొట్టిపారేసింది. ఇజ్రాయెల్‌లో జన్మించిన హాలీవుడ్ నిర్మాత మిల్చన్, ఆస్ట్రేలియాకు చెందిన రిసార్ట్ యజమాని జేమ్స్ ప్యాకర్ నుంచి నెతన్యాహూ, ఆయన భార్య సారా భారీగా ముడుపులు పుచ్చుకున్నారంటున్న కేస్ 1000లోనే టాటాకూ పాత్ర ఉన్నట్లు ఆరోపణ. మిల్చన్కు ప్రయోజనం కలిగేలా నెతన్యాహూ ఫ్రీ ట్రేడ్ జోన్‌కు మద్ద తు పలికారని, ఇందులో టాటాకు భాగస్వామ్యం ఉందని పోలీసులు తెలిపారు. -
ఇజ్రాయెల్‌తో చెలిమి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల పర్యటన కోసం శని వారం న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్ పక్కనపెట్టి విమానాశ్రయానికి వెళ్లడమే కాదు... ఆయనను గాఢంగా హత్తుకుని తన అభిమానాన్ని చాటుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీరును గమనిస్తే పాతికేళ్ల క్రితం మొదలైన ఇరు దేశాల బంధమూ ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. సరిగ్గా ఆరునెలలక్రితం అంటే జూలై మొదటివారంలో మోదీ ఇజ్రాయెల్ పర్య టనకు వెళ్లినప్పుడు కూడా ఈ మాదిరి స్వాగత సత్కారాలే లభించాయి. మన ప్రధాని ఒకరు ఇజ్రాయెల్ పర్యటించడం అదే మొదటిసారి కాగా, ఇజ్రాయెల్ ప్రధాని ఇక్కడకు రావడం పదిహేనేళ్ల తర్వాత ఇది రెండోసారి. మోదీ జూలై పర్యటన సందర్భంగా వ్యవసాయం, జల సంరక్షణ, నవీకరణ రంగాల్లో సహకార ఒప్పందాలు కుదిరాయి. అవన్నీ వెనువెంటనే చకచకా కదిలాయి. ఇండో– ఇజ్రా యెల్ వ్యవసాయ పథకం కింద మన దేశంలో 35 ఎక్స్‌లెన్స్ కేంద్రాలు ప్రారం భించాలని నిర్ణయించగా వాటిలో 20 ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో జల సంరక్షణ విధానాలను అభివృద్ధి చేసి అందులో ఉత్తమ సాంకేతికతను సాధించిన శాస్త్రవేత్తలు మన దేశంలో నీటి కరువు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వినియోగపడగల పథకాలకు తుదిరూపం ఇస్తున్నారు. నవీకరణ రంగానికి సంబంధించినంతవరకూ వ్యవ సాయం, జల సంరక్షణ, ఆరోగ్యం అంశాల్లో ఇరు దేశాలకూ చెందిన 36 ఔత్సాహిక పరిశ్రమలకు అనుమతులు లభించాయి. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి ఏడాదికి చెరో 40 లక్షల డాలర్లు చొప్పున అయిదేళ్లపాటు కేటాయించాలని తాజాగా నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఇప్పుడున్న 500 కోట్ల డాలర్ల స్థాయి నుంచి మరింత పెంచుకోవాలన్న ఉద్దేశం రెండు దేశాలకూ ఉంది. వాణిజ్య రంగంలో భారత్ భాగస్వాముల్లో ఇజ్రాయెల్ స్థానం 38. వివిధ అరబ్ దేశాలు మొదటి 15 ర్యాంకుల్లో ఉన్నాయంటే ఇజ్రాయెల్‌తో మన వాణిజ్యం ఎంత తక్కువగా ఉన్నదో అర్ధమవుతుంది. అయితే ఆయుధాలు, రక్షణ రంగానికి సంబం ధించిన ఇతర కొనుగోళ్లకు సంబంధించినంత వరకూ ఇజ్రాయెల్‌దే అగ్ర స్థానం. ఇజ్రాయెల్ నుంచి ఏటా వంద కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు మన దేశం కొనుగోలు చేస్తున్నది. ఇతర రంగాల్లో సైతం వాణిజ్యం ఈ స్థాయికి విస్తరించాలన్నది రెండు దేశాల ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకునే నెత న్యాహుతో పాటు భారీ పారిశ్రామికవేత్తల బృందం మన దేశం వచ్చింది. అయితే ఇజ్రాయెల్‌తో మన సంబంధాలు సంక్లిష్టమైనవి. రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలనూ ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’గా నెతన్యాహు అభి వర్ణించడం మాటెలా ఉన్నా దాని పర్యవసానాలు కూడా తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కు అరబ్ దేశాలతో ససేమిరా కుదరదు. ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గున మండుతుంది. ఇక పాలస్తీనా సమస్య ఉండనే ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు బలపడేకొద్దీ అరబ్ దేశాలతో, ఇరా న్‌తో మనకున్న సంబంధాలపై అవి తీవ్ర ప్రభావం కలగజేస్తాయని, ఇది మంచిది కాదని దౌత్య నిపుణులు చాన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. మన చమురు దిగు మతుల్లో అరబ్ దేశాల వాటా 50 శాతం. సహజవాయువు అవసరాల్లో 85 శాతం ఆ దేశాలనుంచే లభిస్తుంది. అలాగే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ)తో మన వాణిజ్యం 15000 కోట్ల డాలర్లు మించి ఉంది. మన దేశానికి చెందిన 80 లక్షల మంది యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రైన్ దేశాలకు వలస పోయి అక్కడ ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అయితే ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో ఉన్న సంబంధాలను దెబ్బతీస్తాయని భావించ నవసరం లేదు. తైవాన్‌తో మనకున్న సంబంధాలు చైనాతో ఉన్న సంబంధాలకు అడ్డు రాలేదు. అలాగే చైనా–పాకిస్తాన్ మైత్రి భారత్–చైనా సంబంధాలపై ప్రభా వం చూపడం లేదు. అయితే ఇజ్రాయెల్‌తో పశ్చిమాసియాకు, ఇరాన్‌కు ఉన్న వైరం నేపథ్యం వేరు. 1947లో ఇజ్రాయెల్ ఆవిర్భావం తమ ప్రయోజనాలకు భంగకరమని ముస్లిం ప్రపంచం భావిస్తోంది. జర్మనీలో యూదుల వేధింపును 1938లో మహాత్మా గాంధీ తీవ్రంగా ఖండించినా యూదుల కోసం ఇజ్రాయెల్ ఏర్పరచాలన్న ప్రతిపాదనను ససేమిరా అంగీకరించలేదు. అరబ్‌ల మనసు గెల్చుకుని, వారి ఇష్టంతో మాత్రమే అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. స్వాతంత్య్రానంతరం కూడా మన దేశం ఆ మార్గాన్నే ఎన్నుకుంది. 1947లో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు భారత్ గట్టిగా వ్యతిరేకించింది. మరో రెండేళ్లకు ఐక్యరాజ్యసమితిలో దానికి సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా అంగీకరించలేదు. పాలస్తీనా ప్రజానీకంపై ఇజ్రాయెల్ దాడులు చేసిన ప్పుడల్లా వాటిని మన దేశం ఖండిస్తూనే ఉంది. అమెరికా తన దౌత్య కార్యాలయాన్ని వివాదాస్పద జెరుసలేంకు తరలించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం తీర్మా నించినప్పుడు సైతం మన దేశం దానికి మద్దతునిచ్చింది. ఇటీవలికాలంలో అమెరికా–అరబ్–ఇజ్రాయెల్ దేశాల మధ్య లోపాయికారీగా సాన్నిహిత్యం పెరగడాన్ని, ముఖ్యంగా పర్షియన్ జలసంధిలో ఇరాన్ యుద్ధ నౌకల కదలికపై నిఘాకు అవసరమైన గూఢచార ద్రోన్లను సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్ సరఫరా చేయడాన్ని గమనిస్తే పశ్చిమాసియా మునుపటిలా లేదని, అక్కడ సమీకరణాలు మారుతున్నాయని అవగతమవుతుంది. అటు చైనా తలపెట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్)ను ఇజ్రాయెల్ స్వాగతించడాన్ని, సిరియాకు వ్యతిరేకంగా అల్ కాయిదా, ఐఎస్‌ల సాయం తీసుకోవడానికి అది ప్రయ త్నించడాన్ని మన దేశం వ్యతిరేకించింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఆశిస్తున్నట్టు ఇరు దేశాల సంబంధాలూ వ్యూహాత్మక స్థాయికి చేరడం ఏమేరకు సాధ్యమో, అసలు ప్రస్తుత సంబంధాల పరిధి, పరిమితి ఏమిటో రాగలకాలంలో తేట తెల్లమవుతుంది. -
నెతన్యాహూకే మళ్లీ పట్టం!
ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ విజయం జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహూ మరోసారి కొనసాగనున్నారు. బుధవారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఇప్పటికే మూడు సార్లు వరుసగా ప్రధాని పదవిని చేపట్టిన నెతన్యాహూ.. మరోసారి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఆ దేశంలో పార్లమెంట్ సభ్యుల పదవీకాలం మూడేళ్లు మాత్రమే. దీంతో ఇప్పటికే 9 ఏళ్లు ప్రధానిగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఎన్నికైతే ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధాని పీఠాన్ని అధిష్టించిన నేతగా రికార్డు సృష్టిస్తారు. పార్లమెంట్ లో 120 స్థానాలుండగా... పోటా పోటీగా సాగిన ఈ ఎన్నికల్లో 29 స్థానాలను లికుడ్ సాధించింది. జియోనిస్ట్ యూనియన్‌కు 24, అరబ్ పార్టీల కూటమికి 14 స్థానాలు దక్కాయి. ఎన్నికలకు ముందు రెండు రోజుల వరకు జియోనిస్ట్ యూనియన్ ముందంజలో ఉంది. పలు సర్వేలు కూడా వారికే అనుకూలంగా కనిపించాయి. కానీ ఎన్నికలకు ముందు రోజు పాలస్తీనా అంశంలో ఏమాత్రం వెనక్కితగ్గబోమని, కఠినంగా వ్యవహరిస్తామని నెతన్యాహూ చేసిన ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాల కోసం చిన్న పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు లికుడ్ నేతలు వెల్లడించారు.