అమెరికాపై ప్రతీకారం  తప్పదు: ఇరాన్‌

Iran warns America: Revange For Air Strikes - Sakshi

‘అమెరికాపై కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని అమెరికా క్షిపణి దాడిలో మరణించిన ఖాసిం సులేమానీ స్థానంలో ఇరాన్‌ జనరల్‌గా నియమితులైన ఎస్మాయిల్‌ ఘానీ సోమవారం ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ‘మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనికులపై దాడులు నిర్వహించి తీరుతాం. తమ పిల్లల చావు కోసం వారి తల్లులు, కుటుంబ సభ్యులు నిరీక్షించాలి’ అంటూ సులేమాని కుమార్తె జైనాబ్‌ సోమవారం  ఇరాన్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ హెచ్చరించారు. ఇరాన్‌ భూభాగం నుంచి అమెరికా సైనికులంతా వెళ్లి పోవాలంటూ ఇరాన్‌ పార్లమెంట్‌ తీర్మానం చేసిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘సులేమాని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని ఆ దేవుడే హామీ ఇచ్చారు. తగిన శాస్త్రి చేయగలవాడు అతనే. తప్పకుండా ఆయన చర్యలు ఉంటాయని భావిస్తున్నాను’ ఎస్మాయిల్‌ ఘానీ వ్యాఖ్యానించారు. అమెరికాపై ఇరాన్‌ సైనిక దాడి లేదా ఇస్లామిక్‌ మిలిటెంట్ల ద్వారా ప్రతీకారం తీర్చుకోవచ్చంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా నష్టపరిహారంగా తమకు వందల కోట్ల డాలర్లు చెల్లించాలని, లేకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. 

చదవండి :

మా ప్రతీకారం భీకరం

ట్రంప్ తలపై భారీ రివార్డు ప్రకటించిన ఇరాన్..!

ఆందోళనకు ఊపిరి పోస్తున్నపాటలు

ఆయన సూట్ వేసుకున్న టెర్రరిస్టు..

ఖాసీం అంత్యక్రియలు.. హోరెత్తిన నినాదాలు

ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

అమాయకులను చంపినందుకే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top