ఖాసీం అంత్యక్రియలు.. హోరెత్తిన నినాదాలు

Iraq People Slogans Death To America At Qasem Soleimani Funeral March - Sakshi

టెహరాన్: బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడి చేయటంతో ఇరాన్‌ సైనిక కమాండర్‌ ఖాసీం సులేమానీ మృతి చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సులేమానీకి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. అదేవిధంగా సులేమానీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఇరాక్‌ దేశ ప్రజలు పెద్ద ఎత్తున అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘డెత్‌ టూ అమెరికా’ అంటూ గర్జించారు.  అమెరికాపై ప్రతీకార్య చర్య తప్పదని హెచ్చరించారు. కాగా, వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్‌ సైనిక జనరల్‌ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ, లండన్‌ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్‌ రాయబారి మజీద్‌ తఖ్త్‌ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్న విషయం తెలిసిందే.

చదవండి: అమాయకులను చంపినందుకే..

చదవండి: ఇరాన్‌కు ట్రంప్‌ తీవ్ర హెచ్చరిక

చదవండి: ఎప్పుడో చంపేయాల్సింది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top