తెరుచుకోని ఓ తలుపు కథ.. | door not open at kendal park in new jersey | Sakshi
Sakshi News home page

తెరుచుకోని ఓ తలుపు కథ..

Published Wed, Jan 27 2016 3:12 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

తెరుచుకోని ఓ తలుపు కథ..

న్యూజెర్సీలోని కెండాల్ పార్క్..
జనవరి 23వ తేదీ శనివారం ఉదయం..
షాన్ ఇన్ బయటకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు..
షూ వేసుకుని చకచకా మెట్లు దిగాడు..
బయటకు వెళ్లడానికి తలుపు తీశాడు. ఒక తలుపు తెరుచుకుంది..
మరో తలుపు మాత్రం తెరుచుకోలేదు!! ఎందుకు?
ఫొటో చూడండి మీకే అర్థమవుతుంది.. అమెరికాలోని మంచు తుపాను తీవ్రతను తెలిపే దృశ్యమిది. షాన్ ఇన్ తలుపు

తీయగానే.. బయట పేరుకుపోయిన మంచు మరో తలుపులా తయారై.. అతనికి అడ్డుగా నిల్చుంది. దీంతో బెంబేలెత్తిన షాన్‌ఇన్ ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేశాడు. అయితే.. మంచు తుపాను వల్ల వారు ఆదివారం ఉదయానికి ఆ ప్రాంతానికి చేరుకోగలిగారు. గంటకు పైగా శ్రమించి.. మంచును తొలగించి.. తెరుచుకోని ఆ తలుపును ఎట్టకేలకు తెరిచారు.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement