హెచ్‌-1బీ వీసాపై భారీగా ఫిర్యాదులు

Complaints On Fraud and abuse Over H 1B Visa Says US Officials - Sakshi

వాషింగ్టన్‌ : హెచ్‌-1బీ వీసాలలో మోసాలు, దుర్వినియోగం జరిగనట్టు భారీగా ఫిర్యాదులు వచ్చాయని  అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రకటించారు. హెచ్‌-1బీ, హెచ్‌-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ఉద్దేశించిన తమ ప్రత్యేక ఈ మెయిల్‌, హెల్స్‌లైన్‌కు  5వేలకు పైగా ఫిర్యాదులు అందాయని  యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ అధికార ప్రతినిధి ఫిలిప్‌ స్మిత్‌ తెలిపారు. గత ఏడాదికి సంబంధించి ఈ అక్రమాలు తమ దృష్టికి వచ్చాయన్నారు.  అయితే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఏ రకమైన ఫిర్యాదులు వచ్చాయి, ఏయే దేశాల నుంచి వచ్చాయి అనే వివరాలను అధికారికంగా ఆయన ప్రకటించలేదు.

అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాల జారీ విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికా ఉద్యోగాలు అమెరికా పౌరులకే చెందాన్ననినాదంతో వీసా నిబంధనల్లో మార్పులకు  గతేడాది నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీసా జారీ ప్రక్రియలో అక్రమాలు, మోసాలను నివారించేందుకు  సంబంధిత చర్యలను  కూడా  చేపట్టారు. ముఖ్యంగా  హెచ్‌-1బీ, హెచ్‌-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి  ప్రత్యేకంగా ఈ మెయిల్‌ హెల్స్‌లైన్ (ReportH1BAbuse@uscis.dhs.gov/ReportH2BAbuse@uscis.dhs.gov) ను ఏర్పాటు చేశారు. అనుమానిత వీసాలతో పాటు, దుర్వినియోగానికి పాల్పడుతున్న డేటాను గుర్తించడానికి ఇది సహకరిస్తుంది.  కాగా అమెరికా ప్రభుత్వం ఏడాదికి 65,000ల హెచ్‌-1బీ వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top