చంద్రయాన్‌ 2 ద్వారా లేజర్‌ పరికరాలు

Chandrayaan 2 will carry NASA laser instruments to Moon - Sakshi

చంద్రుడి పైకి పంపనున్న నాసా

వాషింగ్టన్‌: భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్‌ 2’మిషన్‌ ద్వారా లేజర్‌ పరికరాలు పంపాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. వచ్చే నెలలో ఈ మిషన్‌ను లాంచ్‌ చేయనున్నారు. చంద్రయాన్‌2 ద్వారా భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరాన్ని కచ్చితత్వంతో కొలిచే లేజర్‌ పరికరాలను పంపనున్నట్లు నాసా తెలిపింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల జరిగిన లూనార్‌ అండ్‌ ప్లానిటరీ సైన్స్‌ కాన్ఫెరెన్స్‌లో ఈ మేరకు వెల్లడించారు. ఏప్రిల్‌ 11న నాసాకు చెందిన లేజర్‌ రెట్రోరిఫ్లెక్టర్‌లను చంద్రయాన్‌ 2 ద్వారా పంపనున్నట్లు తెలిపింది. ఇలాంటి ఐదు పరికరాలు ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉన్నా.. వాటిలో కొన్ని లోపాలు తలెత్తాయని ఇటలీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ న్యూక్లియర్‌ లేబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త సైమన్‌ డెల్‌ యాగ్నెల్లో వెల్లడించారు. చంద్రుడిపై మెరుగైన పరిశోధనలకు ఈ రిఫ్లెక్టర్లు తోడ్పడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top