
రోడ్డు ప్రమాదంలో 31మంది అథ్లెట్ల దుర్మరణం
మొరాకోలో ఘోరం జరిగింది. శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 31 మంది అథ్లెట్లతో సహా 40 మంది మరణించారు.
రబాట్: మొరాకోలో ఘోరం జరిగింది. శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 31 మంది అథ్లెట్లతో సహా 40 మంది మరణించారు. యువ అథ్లెట్లు, కోచ్లు ప్రయాణిస్తున్న బస్సును ఆయిల్ ట్రక్ ఢీకొనడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు అగ్నికీలకల్లో ఆహుతవడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. అథ్లెట్లు మంటల్లో చిక్కుకుని దహనమయ్యారు.
ఉత్తర మొరాకోలో పోటీలో పాల్గొన్న అనంతరం అథ్లెట్లు తిరిగివస్తుండగా టన్ టన్ నగరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ సయమంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అథ్లెట్లతో సహా 40 మంది మంటల్లో కాలి మరణించగా, మిగిలినవారు తీవ్రంగా గాయపడ్డారు.