సిరియాలోని షియాలే లక్ష్యంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది మరణించారు.
డమాస్కస్: సిరియాలోని షియాలే లక్ష్యంగా శనివారం జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 70 మంది మరణించారు. ప్రభుత్వ అనుకూల షియా వర్గ ప్రజల్ని ఉత్తర సిరియా నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అలెప్పో రాష్ట్రంలోని రషిదీన్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దుండగులు ట్రక్కుతో ఆత్మాహుతి దాడికి పాల్పడి మారణహోమం సృష్టించారు.
షియా పట్టణాలైన కఫ్రయా, ఫోయా నుంచి ప్రజల్ని అలెప్పీలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇటీవలే తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. అందుకు ప్రతిగా మాదయ, జబదాని ప్రాంతాల నుంచి తిరుగుబాటుదారుల కుటుంబాలు ఇడ్లిబ్ రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించింది.