ఏడేళ్లు.. 8 ప్యాక్‌ | 8 pack in seven years | Sakshi
Sakshi News home page

ఏడేళ్లు.. 8 ప్యాక్‌

Jul 7 2017 2:35 AM | Updated on Sep 26 2018 3:36 PM

ఏడేళ్లు.. 8 ప్యాక్‌ - Sakshi

ఏడేళ్లు.. 8 ప్యాక్‌

కండలు తిరిగిన దేహం కావాలంటే కసరత్తులు చేయాల్సిందే.

కండలు తిరిగిన దేహం కావాలంటే కసరత్తులు చేయాల్సిందే. ఇందుకోసం బాలీవుడ్, టాలీవుడ్‌ హీరోలు జిమ్‌లలో పడుతున్న కష్టాలను అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. సిక్స్‌ ప్యాక్‌లో మా హీరో ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో చూడండి.. అంటూ అభిమానులు చెప్పుకోవడం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఓ బుడతడి దేహదారుఢ్యాన్ని చూసి ముచ్చటపడుతోంది. ఎందుకంటే ఏడేళ్లు కూడా నిండకుండానే పలక చేతిలో పట్టుకోవాల్సిన వయసులో ఎనిమిది పలకల దేహంతో అలరిస్తున్నాడు ఓ చైనా కుర్రోడు. పేరు.. చెన్‌ యి.

హాంగ్‌ఝౌ నగరానికి చెందిన ఈ బుడ్డోడు ఇటీవల చైనాలో జరిగిన ఓ జిమ్నాస్టిక్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలవడమే కాదు, ఇప్పటిదాకా ఆరు బంగారు పతకాలు, ఓ వెండి పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన విషయాన్ని చెప్పేందుకు 8 ప్యాక్‌ బాడీతో ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా మరుక్షణమే 25,000 మంది లైక్‌లు కొట్టారు. 500 మంది ఈ ఫొటోలను షేర్‌ చేశారు. ఇక ఈ 8 ప్యాక్‌ వెనుక సీక్రెట్‌ ఏంటని చెన్‌ను అడిగితే.. ఐదేళ్ల నుంచే ప్రొఫెషనల్‌ జిమ్నాస్ట్‌గా ప్రాక్టీస్‌ మొదలు పెట్టానని, అదే కంటిన్యూ చేస్తుండడంతోనే 8 ప్యాక్‌ బాడీ సాధించగలిగానని చెబుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement