232 మంది ఉగ్రవాదులు హతం | 232 militants killed in Egypt in last four days | Sakshi
Sakshi News home page

232 మంది ఉగ్రవాదులు హతం

Sep 12 2015 12:30 PM | Updated on Sep 3 2017 9:16 AM

' అమరవీరులకు నివాళి' అనే పేరుతో ఈజిప్ట్ సైన్యం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా 232 మంది ఉగ్రవాదులను హతమార్చింది.

చారిత్రక సీనాయి ద్వీపకల్పాన్ని స్థావరంగా చేసుకుని ఈజిప్ట్ లో మారణహోమాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులను ఈజిప్ట్ సైన్యాలు సమర్థవంతంగా నిలువరించాయి.

' అమరవీరులకు నివాళి' అనే పేరుతో నాలుగు రోజుల క్రితం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా సీనాయి ద్వీపకల్పాన్నిచుట్టుముట్టామని, ఇప్పటివరకు 232 మంది ఉగ్రవాదులను హతమార్చామని సైన్యం అధికార ప్రతినిధి మహమ్మద్ సమీర్ మీడియాకు చెప్పారు. 2013లో అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ గద్దెదిగిన తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడిన ఈజిప్టులో పాదం మోపేందుకు ఐఎస్ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement