బస్సు ప్రమాదం.. 17మంది సజీవ దహనం

 17 people were killed when a minibus crashed and caught fire - Sakshi

అంకారా : టర్కీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచోసుకుంది. ఈ ఘటనలో 17 మంది సజీవదహనమవ్వగా.. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ మినీ బస్‌ అదుపు తప్పి కరెంట్‌ పోల్‌కు ఢీ కొట్టడంతో ఇంజన్‌ నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు నిండా మంటలు చెలరేగటం, అందరూ నిద్ర మత్తులో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.

ఇగ్దీస్‌ ప్రోవిన్స్‌ పరిధిలో చోటు చేసుకుందని.. ఈ బస్సులో అఫ్గానిస్తాన్‌, పాకిస్తాన్‌, ఇరాన్‌ దేశస్తులుగా గుర్తించామని, వీరు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా టర్కీలోకి ప్రవేశించారని టర్కీ పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీరి దగ్గర ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో వీరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స అనంతరం విచారణ చేపడతామన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top