బొజ్జా తారకానికి వైఎస్ జగన్ ఘన నివాళి | ys jagan mohan reddy pays tribute to bojja tharakam | Sakshi
Sakshi News home page

బొజ్జా తారకానికి వైఎస్ జగన్ ఘన నివాళి

Sep 17 2016 11:14 AM | Updated on Apr 3 2019 6:20 PM

బొజ్జా తారకానికి  వైఎస్ జగన్ ఘన నివాళి - Sakshi

బొజ్జా తారకానికి వైఎస్ జగన్ ఘన నివాళి

దళిత ఉద్యమ నేత బొజ‍్జా తారకానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.

హైదరాబాద్ : పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత బొజ‍్జా తారకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  బొజ్జా తారకం భౌతికకాయాన్ని వైఎస్ జగన్ సందర్శించి, అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు పార్థసారధి, విశ్వరూప్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కూడా ఉన్నారు.

కాగా సందర్శకుల కోసం బొజ్జా తారకం భౌతికకాయాన్ని సాయంత్రం మూడు గంటల వరకూ ఇక్కడే ఉంచుతారు. నాలుగు గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు.

 



 

Advertisement
 
Advertisement
Advertisement