అఖిలపక్షం ఏర్పాటు చేయాలి | want to all party meeting on rohith vemula statement : kathi padm arao | Sakshi
Sakshi News home page

అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

Oct 8 2016 3:15 AM | Updated on Jul 26 2019 5:38 PM

అఖిలపక్షం ఏర్పాటు చేయాలి - Sakshi

అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

రోహిత్ మరణంపై ప్రస్తుత న్యాయసాధికార మంత్రి రామ్‌దేవ్ అటాలే, రాంవిలాస్ పాశ్వాన్, మాయావతి, సీతారాం ఏచూరిలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని..

రోహిత్ మృతిపై కత్తి పద్మారావు డిమాండ్
పొన్నూరు: రోహిత్ మరణంపై ప్రస్తుత న్యాయసాధికార మంత్రి రామ్‌దేవ్ అటాలే, రాంవిలాస్ పాశ్వాన్, మాయావతి, సీతారాం ఏచూరిలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రోహిత్ దళితుడు కాదనడం, అతని ఆత్మహత్య వెనుక స్మృతి ఇరానీ, దత్తాత్రేయ ప్రమేయం లేదని అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే రూపస్‌వాల్ ఇచ్చిన రిపోర్టు సరైనది కాదన్నారు.

ఈ రిపోర్టును నిర్వీర్యం చేయడంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందన్నారు.  పార్లమెంటులోని 111 మంది దళిత ఎంపీలు ఆ నివేదిక అవాస్తవమని నిరాకరించాలని కోరారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు సొంత సామాజిక వర్గానికి చెందిన అప్పారావును రక్షించాలనే కాంక్షతోనే ఇటువంటి నివేదికలు తెచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement