
సామాన్యుల జీవితాలు అస్తవ్యస్తం
పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం వాడివేడిగా సాగింది.
• నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం: ఉత్తమ్
• నల్లధనానికి అడ్డుకట్ట: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం వాడివేడిగా సాగింది. ‘తెలంగాణ సమాజంపై ప్రభావం’ అంశంపై మంగళవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇది ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయమ న్నారు. ‘సామాన్యుల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఎక్కడ చూసినా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలే కనిపిస్తున్నారుు. గంటల తరబడి వేచివున్నా ఏటీఎంలలో డబ్బులు లేక వెనుదిరిగి వెళుతున్నారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి రెండున్నరేళ్లుగా మోదీ ఏంచేశారు?
100 రోజుల్లో విదేశాల నుంచి నల్లధనం తెచ్చి అకౌంట్లల్లో జమ చేస్తామన్న హామీ ఎటుపోరుుంది? ఆ విషయం అవగాహన లేక చెప్పారా... కావాలనే విస్మరించారా అనేది అర్థం కావటంలేదు. పెద్ద నోట్లు రద్దు అన్న పెద్ద మనిషి రూ.2వేల రూపాయల నోటు ఎందుకు తెచ్చారన్న దానికి సమాధానం లేదు. నోట్ల రద్దు వల్ల ఎక్కువ ప్రభావితం అరుుంది గ్రామీణ రైతులు, మధ్యతరగతి ప్రజలు. రాజకీయ అవినీతి పెద్ద సమస్యే. అందుకు మేమందరం బాధ్యలమే. నోట్ల రద్దు నిర్ణయం వెనక్కు తీసుకోవాలి. రూ.2 వేల నోటు రద్దు చేయాలి. పాత నోట్లు ఇస్తే 30శాతం కమీషన్ అనేది ఇప్పుడు హాట్‌హాట్ గా నడుస్తోంది’ అని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
రూ.100 నోట్లు చాలు...
తెలంగాణ యునెటైడ్ ప్రంట్ కన్వీనర్ విమలక్క మాట్లాడుతూ రూ.2వేలు, రూ.500 నోట్లు వద్దని, రూ.100నోట్లు మాత్రమే రా వాలన్నారు. ఇది ఒక రాజకీయ క్రీడన్నారు. ప్రతివారి చేతిలో రూ.500 నోట్లున్నాయని, అందుకే ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు. సామాజిక విశ్లేషకులు డి.నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. నోట్ల రద్దుపై శాస్త్రీయ అధ్యయనం లేదన్నారు. తెలంగాణ రైతులు చావుదెబ్బ తిన్నారన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు తో రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపు తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
నోట్ల రద్దు నిర్ణయా న్ని స్వాగతిస్తున్నామని, అరుుతే సామాన్యుల కు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ‘నల్ల కుబేరులకు ప్రధాని నిర్ణయంతో నష్టం లేదు. నష్టపోయేది ప్రజలే. దోపిడిదారులపై మోదీ సర్జికల్ దాడులు ఎందుకు చేయరు’ అని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు శ్రీశైలం,సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ సుజాత పాల్గొన్నారు.
సాహసోపేత నిర్ణయం
పెదనోట్ల రద్దు సాహసోపేత నిర్ణయమని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. అమలులోని లోపాలు సరిదిద్దా లన్నారు. నల్లధనంపై తీసుకునే చర్యల వల్ల వచ్చే నిధులను రాష్ట్రాలకు పంచాల న్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ స్పందిచాలన్నారు. గ్రామల ప్రజలు, రైతులు ఇబ్బందులను పరిగణలోకి తీసు కోవాలన్నారు. మద్యం, రియల్ వ్యాపా రాల ఆదాయం తగ్గి జీతాలు ఇవ్వలేం అంటున్న పరిస్థితులు వినవస్తున్నాయని తెలిపారు. ఎలా నష్టమో స్పష్టంగా చెప్పా లన్నారు. నష్టం తీవ్రంగా ఉంటే కేంద్రం వద్దకు వెళ్దామని, అందరం కలసి ప్రధానిని కలుద్దామని చెప్పారు.
తప్పుదోవ పట్టించవద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దుతో బ్లాక్ మనీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. ప్రజల ను తప్పుదోవ పట్టించొద్దన్నారు. అద్భుతా లు సృష్టించటం మోదీ నైజమన్నారు. 2014లో ఎన్నికల్లో అవినీతే ప్రధాన అంశం గా మోదీ ప్రజల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ హయంలో అనినీతి పెరిగిపోరుుందని తెలిపారు. అనినీతి నిర్మూలన, నల్ల ధనం వెలికితీతకే పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. నోట్ల రద్దుతో ప్రభుత్వానికి వచ్చే నల్లధనం ప్రజలకే చెందుతుందన్నారు. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలపడాల్సి ఉందన్నా రు. నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు నల్ల కుబే రులకు లాభం చేసినవారవుతారన్నారు.