
ఏడుగురు అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది.
హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. నల్లగొండ జిల్లా అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించిన టీఆర్ఎస్.. ఆదివారం మరో ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ రోజు కసరత్తు చేశారు. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైనట్టు సమాచారం.
జిల్లాల వారీగా ఈ రోజు ప్రకటించిన వారి పేర్లు:
నిజామాబాద్- భూపతి రెడ్డి, ఖమ్మం-బాలసాని, ఆదిలాబాద్-పురాణం సతీష్, మెదక్-భూపాల్ రెడ్డి, కరీంనగర్-నారదాసు లక్ష్మణ్ రావు, భానుప్రసాద్ రావు