భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు.
ఖమ్మం: భద్రాచలంలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు. ఉత్సవాలకు భారీగా తరలివచ్చిన భక్తులు. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం కేసీఆర్.60 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేసిన దేవస్థానం.
విజయనగరం : రామతీర్థంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు. సింహచలం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. నేడు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేయనున్న దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు. స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు క్యూ.
కడప : ఒంటిమిట్ట రామాలయంలో నేటి నుంచి నవమి బ్రహ్మోత్సవాలు. నేడు ఆలయంలో ధ్వజారోహణం, హాజరుకానున్న మంత్రి గంటా... టీటీడీ చైర్మన్ చదలవాడ
తిరుమల : నేడు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం. రేపు పట్టాభిషేకం... ఆర్జిత సేవలు రద్దు
న్యూఢిల్లీ: నేటి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు సరి - బేసి సంఖ్యల కార్ల అమలు
ముంబై : నేడు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల సమావేశం
కరీంనగర్ : నేడు వేములవాడలో సీతారాముల కల్యాణం. నేటితో ముగియనున్న వసంతరాత్రులు, రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు.
నేడు, రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు