రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం | Temperatures in the state of decline | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

Jan 16 2017 12:57 AM | Updated on Oct 17 2018 5:37 PM

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం - Sakshi

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల మేర తగ్గాయి.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల మేర తగ్గాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. భద్రాచలం, హకీంపేట, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండల్లో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిజామాబాద్, హైదరాబాద్‌లో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అటూఇటుగా నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement