యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు | Tammineni veerabadram about notes cancellation | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు

Nov 21 2016 1:52 AM | Updated on Sep 4 2017 8:38 PM

యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు

యూపీ ఎన్నికల కోసమే నోట్ల రద్దు

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

తమ్మినేని వీరభద్రం డిమాండ్
సాక్షి, ఝరాసంగం/హైదరాబాద్: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం సం గారెడ్డి జిల్లా రారుుకోడ్, వట్‌పల్లి మండలాల్లో మ హాజన పాదయాత్ర సా గింది. సిరూర్‌లో జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు, చిరుద్యోగులు, కార్మికులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

దొంగనోట్లు, నల్లధనం ఉన్న బడాబాబులను వదిలేసి సామాన్యులపై పడడం సరికాదన్నారు. కొత్త నోట్లను ముద్రించేం దుకు 3 నెలల సమయం పడుతుందని, అప్పటివరకు పాత నోట్లు చలామణి అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పక్షాన ఎందుకు పోరాడటం లేదని తమ్మినేని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement