హైకోర్టుకు చేరిన జాబిలి మిస్సింగ్‌ మిస్టరీ | shamshabad women missing case | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు చేరిన జాబిలి మిస్సింగ్‌ మిస్టరీ

Sep 21 2017 2:22 PM | Updated on Sep 22 2017 10:02 AM

శంషాబాద్ లో మిస్టరీ గా మారిన యువతి మిస్సింగ్ కేసు హైకోర్టుకు చేరింది.

రంగారెడ్డి: శంషాబాద్ లో మిస్టరీ గా మారిన యువతి మిస్సింగ్ కేసు హైకోర్టుకు చేరింది. ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయినా లాభం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూలై 20 న ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన జాబిలి అనే యువతి తిరిగి ఇంటికి చేరలేదు.
 
దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. రెండు నెలలు దాటినా కూతురి జాడ తెలియకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అక్టోబర్‌ 3 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సైబరాబాద్‌ పోలీసులను న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement