
సీఎం హామీ ఏమైంది?: సంపత్
రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి అఖిలపక్ష బృందంతో వచ్చి కేంద్ర పెద్దలతో కలుస్తానన్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఏమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రశ్నించారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి అఖిలపక్ష బృందంతో వచ్చి కేంద్ర పెద్దలతో కలుస్తానన్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు హామీ ఏమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ వివిధ రాష్ట్రాల నేతలతో సమావేశమయ్యారు.
ఈ భేటీకి హాజరైన ఎమ్మెల్యే సంపత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 28 తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే ఒక్క అంశంపై కూడా కేంద్రం నుంచి స్పందన లేదు’ అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు, మతతత్వ రాజకీయాలు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.