చర్లపల్లి జైల్లో తనిఖీలు... సెల్ ఫోన్లు స్వాధీనం | police officials raids in Cherlapally Jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్లో తనిఖీలు... సెల్ ఫోన్లు స్వాధీనం

Aug 24 2014 2:03 PM | Updated on Aug 21 2018 7:26 PM

చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వద్ద 3 సెల్ఫోన్లతోపాటు రూ.1500 నగదు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. సెల్ఫోన్లతోపాటు నగదు పోలీసు ఉన్నతాధికారు స్వాధీనం చేసుకున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా ఉండే జైలులో.. ఖైదీల వద్దకు ఇవి ఎలా చేరాయంటూ ప్రశ్నించారు. దాంతో జైలు అధికారులు నీళ్లు నమిలారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సదరు అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement