ఓటర్లూ ఇవి గమనించండి... | Please note that the voters are... | Sakshi
Sakshi News home page

ఓటర్లూ ఇవి గమనించండి...

Feb 1 2016 1:36 AM | Updated on Sep 3 2017 4:42 PM

మొబైల్ (సెల్‌ఫోన్) యాప్ ద్వారా లక్షకు పైగా ఓటర్లు తమ ఓటరు స్లిప్‌ను సెల్‌ఫోన్‌లో సేవ్ చేసుకున్నారు. ఇక వేరే స్లిప్ అవసరం లేదు..

మొబైల్ (సెల్‌ఫోన్) యాప్ ద్వారా లక్షకు పైగా ఓటర్లు తమ ఓటరు స్లిప్‌ను సెల్‌ఫోన్‌లో సేవ్ చేసుకున్నారు. ఇక వేరే స్లిప్ అవసరం లేదు.. ఫోన్‌లోని వివరాలే పోలింగ్ కేంద్రంలో చూపిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. కానీ..అది కుదరదు. పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్లను అనుమతించరు. పోలింగ్‌స్టేషన్ వివరాలు తెలుసు కనుక ఎలాగూ పోలింగ్ కేంద్రం వరకు వెళతారు. అక్కడ త్వరితంగా మీ వివరాల్ని పోలింగ్ అధికారులు గుర్తించాలంటే పోలింగ్‌స్టేషన్‌లో ఓటరుజాబితాలో  మీ వరుస నెంబరు ఎంతో రాసుకొని వెళ్లి చెప్పినా ఫరవాలేదు. గుర్తుంచుకొని చెప్పినా ఫరవాలేదు. అంతే కానీ.. సెల్‌ఫోన్‌లోనే చూపిస్తామనుకుంటే మాత్రం కుదరదని జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(ఎన్నికలు) సురేంద్రమోహన్ తెలిపారు.                                   
- సాక్షి, సిటీబ్యూరో     
 
 ఓటరు స్లిప్ ఉంది కదా అని దానిని మాత్రమే తీసుకువెళ్లినా ఓటు వేసేందుకు అనుమతించరు. ఓటరు గుర్తింపుకార్డు(ఎపిక్ కార్డు) తీసుకువెళ్లాలి. అది లేని పక్షంలో  దిగువ పేర్కొన్న పత్రాల్లో దేన్నయినా వెంట తీసుకువెళ్లాలి.
 
 1. ఆధార్ కార్డు,  2. పాస్‌పోర్టు,  3.డ్రైవింగ్ లెసైన్స్, 4.పాన్ కార్డు,  
 5. ఉద్యోగుల గుర్తింపుకార్డు(రాష్ట్ర/కేంద్ర/ప్రభుత్వరంగ/స్థానికసంస్థ/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ), 6. బ్యాంక్/పోస్టాఫీసు/కిసాన్ పాస్‌బుక్‌లు.
 7.పట్టా , రిజిస్టర్డ్ డీడ్స్, 8. రేషన్‌కార్డు,  9. ఎస్సీ/ ఎస్టీ /బీసీ సర్టిఫికెట్లు
 10.పెన్షన్‌పత్రాలు(ఎక్స్‌సర్వీస్‌మెన్ పెన్షన్ బుక్ /పెన్షన్ పేమెంట్ ఆర్డర్ / ఎక్స్ సర్వీస్‌మన్ల  వితంతు / ఆధారపడ్డ వారి సర్టిఫికెట్స్/ వృద్ధాప్య , వితంతు పెన్షన్  ఉత్తర్వులు, 11.స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపుకార్డు
 12.ఆయుధ లెసైన్సు, 13. వికలాంగుల సర్టిఫికెట్, 14. ఏటీఎం కార్డులు
 15. బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు, 16. పార్లమెంటు సభ్యుల గుర్తింపు కార్డు.
 17.శాసనసభ, శాసనమండలి సభ్యుల గుర్తింపుకార్డు.
 18.ఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డు, 19.కార్మిక మంత్రిత్వ శాఖ స్కీమ్ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కార్డు, 20. నేషనల్ పాపులేషన్ స్కీమ్ ద్వారా ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, 21. పట్టాదారు పాసు పుస్తకాలు.
 
 ( పైన పేర్కొన్నవాటిపై ఓటరు ఫొటో కలిగి ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కన్నా ముందు తెరచిన ఖాతాలు / జారీ అయిన కార్డులు అయి ఉండాలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement