పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి | pending projects completed properly, demands kishan reddy | Sakshi
Sakshi News home page

పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి

Aug 6 2015 12:52 PM | Updated on Mar 28 2019 8:41 PM

తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు జి.కిషన్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు జి.కిషన్ రెడ్డి సూచించారు. గురువారం హైదరాబాద్లో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై బీజేపీ నిర్వహించిన అవగాహన సదస్సులో కిషన్రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ... కృష్ణా, గోదావరిపై పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవుపై ప్రకటన చేయకపోవడం దారుణమని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. త్వరలో పెండింగ్ ప్రాజెక్టులపై పోరాటం చేయనున్నట్లు కిషన్రెడ్డి వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement