చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి | Pawan Kalyan Tweets his Request over Land acquisition act | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Aug 19 2015 1:14 PM | Updated on Mar 22 2019 5:33 PM

భూ సేకరణపై సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్ చేశారు. రాజధాని పరిధిలోని గ్రామాల ...

హైదరాబాద్ :  భూ సేకరణపై సిననటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్ చేశారు. రాజధాని పరిధిలోని గ్రామాల భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని ఆయన ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ బుధవారం ట్విట్ చేశారు.

ఏడాదికి మూడు పంటలు పండే  పెనుమాక, ఉండవల్లి, బేతపూడితోపాటు ఇతర గ్రామాల భూముల విషయంలో భూ సేకరణ చట్టాన్ని వినియోగించవద్దని ఆయన సూచించారు. తక్కువ నష్టంతో ఎక్కువ అభివృద్ధి జరగాలని, పాలకులు వివేకంతో ఆలోచించాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని కోసం ఇంకా సేకరించాల్సిన భూమి విషయంలో 'భూసేకరణ చట్టాన్ని' వినియోగించవద్దని టీడీపీ ప్రభుత్వాన్నికోరుతూ పవన్ గతంలోనూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement