29 నుంచి ఓయూసెట్ కౌన్సెలింగ్ | OUset counseling from 29 | Sakshi
Sakshi News home page

29 నుంచి ఓయూసెట్ కౌన్సెలింగ్

Jun 28 2016 3:48 AM | Updated on Sep 4 2017 3:33 AM

ఓయూసెట్-2016 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు కొనసాగుతుందని ఓయూ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ సోమవారం తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: ఓయూసెట్-2016 మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు కొనసాగుతుందని ఓయూ పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ సోమవారం తెలిపారు.

ఓయూతో పాటు తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ విశ్వవిద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు తమ ర్యాంకుల ఆధారంగా కళాశాలలను ఎంపిక చేసుకొని ఆప్షన్స్ ఇచ్చుకోవాలన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరగనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement