ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసే కుట్ర: మంద కృష్ణ | mandakrishna madiga takes on kcr | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసే కుట్ర: మంద కృష్ణ

Dec 21 2014 3:07 AM | Updated on Aug 15 2018 7:50 PM

ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుట్రలు..

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుట్రలు పన్నుతున్నారని ఎంఎస్‌పీ అధినేత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. శనివారం ఉస్మానియా వర్సిటీ లైబ్రరీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘ఎస్సీ రిజర్వేషన్లను సమానంగా పంచుకుందాం-దళిత ఐక్య ఉద్యమాలు నిర్మిద్దాం’ అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న మంద కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్‌ది నిజాం నిరంకుశత్వంతో కూడిన  కుటుంబ పాలన అని విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement