కుత్భుల్లాపూర్ పరిధిలోని ఓ స్కూలు ప్రిన్సిపల్‌ను వేధించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
మహిళా ప్రిన్సిపల్‌కు వేధింపులు: వ్యక్తి అరెస్ట్
Jan 20 2017 4:26 PM | Updated on Oct 9 2018 5:39 PM
హైదరాబాద్: కుత్భుల్లాపూర్ పరిధిలోని ఓ స్కూలు ప్రిన్సిపల్ లావణ్య గౌడ్‌ను వేధించిన వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఉపేంద్రచారీన తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేస్తుండటంతో లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా ఇదే విధంగా వేధింపులు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన ఉపేంద్ర మళ్లీ వేధింపులకు పాల్పడటంతో అరెస్ట్ చేశారు.
Advertisement


